Mobile Popup Ad
Mobile Popup Ad

అమ‌రావ‌తి చ‌ట్ట‌బ‌ద్ధ‌త‌తో పెట్టుబ‌డిదారుల‌కు భ‌రోసా: బాల‌కృష్ణ‌

క‌లం, వెబ్ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతి (Amaravati)ని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడంపై హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna) హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదంతో వెలువడిన ఈ ప్రకటన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి చారిత్రాత్మక విజయమని ఆయన అభివర్ణించారు. అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదని, అది మన ఆత్మగౌరవానికి, భవిష్యత్తుకు ప్రతీక అని పేర్కొన్నారు. ఈ విజయం రాజధాని కోసం పోరాడిన రైతుల త్యాగానికి, ప్రజల ఆశలకు లభించిన న్యాయమని కొనియాడారు.

ఈ చారిత్రాత్మక నిర్ణయానికి సహకరించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మద్దతు తెలిపిన అన్ని పార్టీలకు, పార్లమెంట్ సభ్యులకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా అమరావతి రైతుల సహనం, నిబద్ధతే ఈ విజయానికి పునాది అని ఆయన (Balakrishna) అభినందించారు. ఈ గెజిట్ నోటిఫికేషన్‌తో పెట్టుబడిదారులకు పూర్తి భరోసా కలుగుతుందని, అందరం కలిసి అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుదామని బాలకృష్ణ పిలుపునిచ్చారు.

Read Also: నీటి కోసం వ‌చ్చి.. కుక్క‌ల దాడిలో చ‌నిపోయిన‌ చిరుత పిల్ల!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>