బీఆర్‌ఎస్ హయాంలో 6వేల ఫోన్లు ట్యాప్ చేశారు : సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్ : ఫోన్ ట్యాపింగ్ కేసుపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ ఎస్ హయాంలో 6వేల ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వల్ల ఎంతో మంది జీవితాలు బలైపోయాయని సీఎం రేవంత్ వెల్లడించారు. ఆ కేసుపై ప్రభుత్వం ఒక ప్రాసెస్ ప్రకారమే ముందుకు వెళ్తోందని.. విచారణ జరగకుండా ఎవరిని అరెస్ట్ చేయలేం కాబట్టే ఊరుకున్నామని సీఎం స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే అనుమతి ఇచ్చిందని.. ఇప్పటికే అరవింద్ కుమార్ ను సస్పెండ్ చేశామన్నారు సీఎం.

ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) ప్రభాకర్ రావు స్టేట్ మెంట్ రికార్డు చేస్తున్నామని రేవంత్ చెప్పారు. ‘ఫోన్ ట్యాపింగ్ కేసులో కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని హరీష్ రావు (Harish Rao) అసత్య ప్రచారం చేస్తున్నారు. పంజాగుట్ట ప్రైవేట్ కేసులో ఆయనకు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నన్ను విచారణకు రమ్మని పిలిచినా వెళ్తాను’ అని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) చెప్పారు.

2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఏ వ్యవహారంపై హరీష్‌ రావు, కేటీఆర్ ఏ విచారణ కోరినా అందుకు సిద్ధమని సీఎం రేవంత్ చెప్పారు. హిల్ట్ పాలసీ, టీడిఆర్ పై కేటీఆర్, హరీష్ రావు ఏ విచారణ చేపించమంటే ఆ విచారణ చేపిస్తాం’ అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

Read Also: ఫుడ్ ప్రియులకు షాక్ ఇచ్చిన జొమాటో

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>