కరీంనగర్‌లో కిడ్నాప్ కలకలం.. రూ.52 వేల దోపిడీ కేసును ఛేదించిన టూ టౌన్ పోలీసులు

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన అపహరణ, అక్రమ నిర్బంధం, బెదిరింపులకు సంబంధించిన దోపిడీ కేసును టూ టౌన్ పోలీసులు శీఘ్రంగా ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం.. నిందితులు బాధితుడిని ఇంటి వద్ద నుంచి మాయమాటలు చెప్పి కారులో ఎక్కించుకుని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి శారీరకంగా దాడి చేసి, ప్రాణహాని కలిగిస్తామని బెదిరించారు.

అనంతరం బాధితుడి సెల్‌ఫోన్‌ను బలవంతంగా స్వాధీనం చేసుకుని, ఫోన్‌పే, క్రెడిట్ కార్డుల ద్వారా మొత్తం రూ.52,009 నగదును అక్రమంగా తీసుకున్నారు. తర్వాత బాధితుడిని విడిచిపెట్టి, ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. సాంకేతిక ఆధారాలు, విశ్వసనీయ సమాచారంతో దర్యాప్తు చేశారు. టూ టౌన్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, వారు నేరాన్ని అంగీకరించారు.

ఈ మేరకు అమ్మిగల్ల ప్రశాంత్ అలియాస్ శశి, అమ్మిగల్ల అంజయ్య అలియాస్ అంజి, కావంపల్లి శ్రావణ్ కుమార్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నిందితుల వద్ద నుంచి రూ.20,000 నగదు, మూడు VIVO మొబైల్ ఫోన్లు, నేరానికి ఉపయోగించిన మహీంద్రా Marazzo కారు (TS 07 UH 8451) ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును విజయవంతంగా ఛేదించిన కరీంనగర్ టూ టౌన్ పోలీసు బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>