కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా మారిన జగన్, షర్మిల ఆస్తుల వివాదంపై వైఎస్ విజయమ్మ (YS Vijayamma) సంచలన ప్రకటన చేశారు. 2009లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YSR) మరణం వరకు ఉన్న ఆస్తులన్నీ ఉమ్మడి కుటుంబ ఆస్తులేనని ఆమె స్పష్టం చేశారు. తమ కుటుంబంలో ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదని.. అన్ని ఆస్తులను నలుగురు మనుమలుకు సమానంగా పంచాలని వైఎస్ఆర్ ఉద్దేశమని ఆమె తెలిపారు. MOUలో షర్మిలకు రాసిన ఆస్తులన్నీ న్యాయంగా ఆమెకు చెందాల్సినవే.. అందుకే జగన్ MOU రాసినట్లు ఆమె పేర్కొన్నారు.
అయితే ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడు, మేనకోడలికి ఇప్పటి వరకు అన్యాయం చేశాడు. భవిష్యత్‌లో న్యాయం చేస్తాడని తన తల్లిగా ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు. వైఎస్ కుటుంబ ఆస్తులపై తాను ఇచ్చిన స్టేట్మెంట్‌ను నోటరీ చేసి విడుదల చేసినట్లు విజయమ్మ తెలిపారు. తమ కుటుంబంలో ఇప్పటివరకు ఆస్తుల పంపకం జరగలేదని ఆమె వెల్లడించారు. ఈ ప్రకటనతో జగన్, షర్మిల మధ్య ఆస్తుల అంశం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. విజయమ్మ ప్రకటనకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అన్నదానిపై ఆసక్తి నెలకొంది.
Read Also: ఫుడ్ ప్రియులకు షాక్ ఇచ్చిన జొమాటో
Follow Us On: Instagram

