ఫుడ్ ప్రియులకు షాక్ ఇచ్చిన జొమాటో

కలం, వెబ్ డెస్క్ : ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో (Zomato) తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ప్లాట్ ఫామ్ ఫీజును 12.50 నుంచి రూ.14.90కి పెంచింది. దీని వల్ల ప్రతి ఆర్డర్ మీద ఇక నుంచి రూ.2.40 అదనంగా పడనుంది. ఇప్పటికే స్విగ్గీ ప్లామ్ ఫామ్ ఫీజును అత్యధికంగా రూ.14.99 వసూలు చేస్తోంది. ఇంకోవైపు ర్యాపిడో సంస్థ ఓన్లీ పేరుతో ఎలాంటి ప్లాట్ ఫామ్ ఫీజులు లేకుండా డెలివరీ సేవలు ప్రారంభించిన టైమ్ లో.. జొమాటో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం షాకింగ్ గా మారింది.

ఇప్పటికే అనేక ట్రావెల్ యాప్ లు కూడా ఫుడ్ డెలివరీలోకి ఎంట్రీ ఇచ్చాయి. కానీ మొదట్లోనే ఈ కేటగిరీలోకి వచ్చిన జొమాటో (Zomato) యాప్.. ఇన్ని రోజులు మిగతా యాప్ ల కంటే తక్కువ ప్లాట్ ఫామ్ ఫీజును అందించింది. ఇప్పుడు లాభాలను పెంచుకునే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు జొమాటో సంస్థ చెబుతోంది.

Read Also: ఆరు గ్యారంటీలకు మంగళం పాడిన బడ్జెట్ : మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి

Follow Us On: Pinterest

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>