మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) అప్‌కమింగ్ మూవీ ‘మాస్ జాతర(Mass Jathara)’కు ఆదిలోనే హంసపాదు అన్నట్లు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమాను అక్టోబర్ 31న విడుదల చేయడానికి టీమ్ రెడీ అయింది. ఈక్రమంలోనే ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించడానికి నిర్మాత సితారా నాగవంశీ ప్లాన్ చేశారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నా అనేక కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు తీరా ట్రైలర్ లాంచ్ కూడా క్యాన్సిల్ కావడంతో మాస్ ఫ్యాన్స్ కాస్తంత నిరాశ చెందారు. అయితే ముందుగానే అనుకున్నట్లు మంగళవారం జేఆర్సీ కన్వెన్షన్‌లో మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు మేకర్స్ చెప్పారు. ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా తమిళ హీరో సూర్య(Suriya) రానున్నారు.
అసలు రెండు రోజులు రెండు ఈవెంట్లు నిర్వహించాలని ఎందుకు ప్లాన్ చేశారో తెలీదు కానీ.. ఆఖరి నిమిషంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను క్యాన్సిల్ చేశారు. కాగా, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మాత్రమే క్యాన్సిల్ అయిందని, ట్రైలర్ లాంచ్ యథావిధిగా జరుగుతందని స్పష్టం చేశారు. ఈరోజు సాయంత్రం ‘మాస్ జాతర(Mass Jathara)’ ట్రైలర్ డిజిటల్‌గా విడుదలవుతుందని వెల్లడించారు.

