మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పోలీసులను ఆశ్రించారు. కొందరు ఏఐ సహాయంతో తన ఫొటోలు, వీడియోలు చేస్తూ తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్ సీపీ సజ్జనార్‌కు చిరంజీవి ఫిర్యాదు చేశారు. ఏఐ సహాయంతో తన ప్రతిష్టను దెబ్బతీసేలా డీప్ ఫేక్ వీడియోలు, ఫొటోలు రూపొందిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిరంజీవి కోరారు. అయితే తగిన అనుమతులు లేకుండా చిరంజీవి ఫొటోలు, పేరును వాణిజ్య ప్రయోజనాల కోసం వాడకూడదని సిటీ సివిల్ కోర్ట్ స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ అంశంపై పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏఐ సహాయంతో డీప్ ఫేక్‌లు సృష్టించిన వారిని ఐపీ అడ్రెస్‌తో గుర్తించడం కోసం ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Also: హర్షిత్ రాణాకు గంభీర్ స్ట్రాంగ్ వార్నింగ్..

