epaper
Tuesday, November 18, 2025
epaper

వీధి కుక్కలకు టీకాలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు సీరియస్

వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ టీకా అంశంలో కేంద్ర ప్రభుత్వం సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు(Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీధి కుక్కలకు టీకాలు వేసిన తర్వాతనే విడుదల చేయాలని అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు సుప్రీంకోర్టు ఆగస్టు నెలలో ఆదేశాలిచ్చింది. కరిచే కుక్కలు, రేబిస్ వ్యాధి ఉన్న కుక్కలను మాత్రమే షెల్టర్లలో ఉంచాలని, వీధి కుక్కలకు బహిరంగ ప్రేశాలలో ఆహారం ఇవ్వకూడదని ఆగస్టు 11న ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సవరంచింది. తాజాగా ఈ అంశంలో కేంద్రంతో పాటు పలు రాష్ట్రాల ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

వీధి కుక్కల(Stray Dogs) దాడులు జరిగాయంటూ ప్రతిరోజూ వార్తలు వస్తున్నా మీలో చలనం లేదా అంటూ Supreme Court అసహనం వ్యక్తం చేసింది. ‘‘స్టెరిలైజేషన్‌పై ఆగస్టు 22న ఉత్తరులిచ్చాం. ఇప్పటి వరకు వాటికి కౌంటర్ దాఖలు చేయలేదు. ఎందుకు?’’ అని కేంద్ర, పలు రాష్ట్రాల ప్రభుత్వాలను ప్రశ్నించింది. తమ ఆదేశాలపై ఇప్పటి వరకు స్పందించని అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలో తదుపరి విచారణకు తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం త్రిసభ్య ధర్మాసనం.

Read Also: రాహుల్ జర జాగ్రత్త.. హరీష్ రావు స్ట్రాంగ్ వార్నింగ్..

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>