కలం, వెబ్ డెస్క్: రాషా తడానీ.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రవీనాటాండన్ కూతురు. బాలీవుడ్ మూవీ ‘ఆజాద్’ లోని ‘ఉయ్యమ్మా..’ సాంగ్‌తో ఒక్కసారిగా పాపులర్ అయింది. అనన్య పాండే, జాన్వీ కపూర్ తర్వాత ఆ స్థాయిలో క్రేజ్‌ను సొంతం చేసుకున్న స్టార్ కిడ్. ఆసక్తికర విషయం ఏమిటంటే టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతుండటంతో అందరి కళ్లు రాషా తడానీ (Rasha Thadani)పై పడ్డాయి.
రాషా తడానీ బాలీవుడ్‌లో అజయ్ దేవగణ్ మేనల్లుడు ఆమన్ దేవగణ్‌తో ‘ఆజాద్’ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాకపోయినప్పటికీ, ఆమె అందం అందరినీ కట్టిపడేసింది. ‘ఉయ్యమ్మా..’ సాంగ్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. తాజాగా ఈ బ్యూటీ టాలీవుడ్ (Tollywood)లోకి ఎంట్రీ ఇవ్వబోతుండటంతో ఏ సినిమాలో యాక్ట్ చేస్తుంది? ఏ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది? అనే విషయాలు ఆసక్తి రేపాయి.
టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. సూపర్ స్టార్ కృష్ణ (Krishna) మనువడు జయ కృష్ణ అజయ్ భూపతి డైరెక్షన్‌లో సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీలో హీరోయిన్‌గా ఖరారైంది. రాషా తడానీ (Rasha Thadani) శక్తిమంతమైన పాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్‌లో తెరకెక్కనున్న ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో రివీల్ కానున్నాయి.
Read Also: రాజాసాబ్ ఓటీటీ డేట్ ఫిక్స్
Follow Us On : WhatsApp


