epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

రష్మికను విజయ్​ బీట్​ చేస్తాడా?

కలం, వెబ్​ డెస్క్​ : మైసా ఫస్ట్ గ్లింప్స్‌లో రష్మిక మందన్న మాస్ అవతారం చూపించింది. రష్మిక తన సోషల్ మీడియాలో మైసా ఫస్ట్ గ్లింప్‌ను పోస్ట్ చేసింది. అయితే.. విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) రౌడీ జనార్థన గ్లింప్స్ కూడా ఇటీవల రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో విజయ్ రౌడీ జనార్థన, రష్మిక మైసా గ్లింప్స్ (Mysaa vs Rowdy Janardhan) ను అభిమానులు పోల్చి చూస్తున్నారు. ఈ రెండు గ్లింప్స్ లో అటు విజయ్, ఇటు రష్మిక మాస్ అవతారంలో కనిపించడం విశేషం. దీంతో ఏ గ్లింప్స్ మధ్య పోటీ ఏర్పడింది.

రష్మిక మందన్న(Rashmika Mandanna) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మైసా. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో రూపొందుతోన్న మైసా సినిమా ఫస్ట్ గ్లింప్స్ బుధవారం విడుదలైంది. ఈ గ్లింప్స్ లో రష్మికలో కొత్త కోణాన్ని ఆవిష్కరించారు, ఆమె తన కెరీర్ మొత్తంలో ఇప్పటి వరకు క్లాస్ గా, మాస్ గా ఉండే రోల్స్ లోనే కనిపించింది. కానీ.. ఈ తరహా పాత్రలో ఇంతకు ముందు ఎప్పుడూ కనిపించలేదు. 1 నిమిషం 21 సెకన్ల నిడివి గల ఈ గ్లింప్స్‌లో రష్మిక కుర్తా-పైజామా ధరించి, కొత్తగా పోరాటం చేస్తున్నట్టుగా కనిపించింది. రక్తంతో తడిసిన చేతిలో రైఫిల్ పట్టుకుని కనిపిస్తుంది. ఒక సమయంలో కుంటుతూ కింద పడినా, ఆమె తన రైఫిల్‌ను ఎత్తి పోరాడటానికి సిద్ధంగా ఉంది. ఆమె తీవ్రంగా గాయపడినప్పటికీ, ఆమె ఓడిపోయినట్లు లేదు. ఆమె గట్టిగా అరుస్తూ… పోరాటానికి సిధ్దం అనేట్టుగా కనిపించింది.

మైసా సినిమాలో రష్మిక తల్లిగా ఈశ్వరీరావు నటించారు. ఆమె వాయిస్ ఓవర్‌లో “నా బిడ్డ చచ్చింది అన్నారు కానీ.. మట్టి వణికిపోయింది. నా బిడ్డ రక్తాన్ని దాచలేక.. గాలే ఆగిపోయింది.. నా బిడ్డ ఊపిరి మోయలేక.. అగ్గే బూడిద అయ్యింది.. మండుతున్న నా బిడ్డను చూడలేక.. ఆఖరికి చావే చచ్చిపోయింది.. నా బిడ్డను చంపలేక. నా బిడ్డ ఎవరో తెలుసా… అనగానే మైసా అంటూ టైటిల్ రావడం. అక్కడ రష్మిక గట్టిగా అరుస్తూ కనిపించడం.. గ్లింప్స్ ని వేరే లెవల్ కి తీసుకెళ్లిందని చెప్పవచ్చు.

మైసా గ్లింప్స్ గురించి అభిమానులు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఈ సంవత్సరం ది గర్ల్‌ఫ్రెండ్‌లో సిగ్గుపడే మహిళగా నటించిన తర్వాత రష్మిక మాస్ అవతారంలో కనిపించడం చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. వాట్ ఎ మేక్ ఓవర్ – ది గర్ల్‌ఫ్రెండ్ టు మైసా అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఒక అభిమాని అయితే… “అల్ట్రా మాస్ అవతార్‌లో @iamRashmika తో నేషనల్ క్రష్” అని కూడా రాశాడు. ఆ గ్లింప్స్ తమను భావోద్వేగానికి గురి చేసిందని.. ఇది నెక్ట్స్ లెవల్ లో ఉంది అన్నాడు. మైసాను బీట్ చేసే ఛాన్స్ ఉందా రౌడీ జనార్థన ( Mysaa vs Rowdy Janardhan ) అంటూ కామెంట్లు పెడుతుండడం విశేషం.

మైసా గురించి..

మైసా అనేది దర్శకుడు రవీంద్ర పుల్లె తొలి చిత్రం. ఇందులో రష్మిక ప్రధాన పాత్రలో నటించారు. ఈశ్వరీరావు రష్మిక తల్లిగా నటించారు. గురు సోమసుందరం, రావు రమేశ్ కీలక పాత్రల్లో నటించారు. శ్రేయాస్ పి కృష్ణ అందించిన సినిమాటోగ్రఫీకి ఫస్ట్ గ్లింప్స్‌లో ప్రశంసలు అందుకున్నారు. అలాగే జేక్స్ బెజోయ్ కూడా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు మంచి స్పందన వచ్చింది. ఆండీ లాంగ్ ఈ చిత్రానికి స్టంట్ కొరియోగ్రాఫర్ గా చేశారు. మైసా ప్రస్తుతం తెలంగాణ, కేరళలోని దట్టమైన అడవులలో చిత్రీకరణ జరుపుకుంటుంది. అయితే.. ఈ సినిమా ఎప్పుడు విడుదల అనేది ఇంకా కన్ ఫర్మ్ చేయలేదు.

Read Also: టాలీవుడ్ క్రేజీ కాంబో రిపీట్.. వారణాసికి మించి, భారీ బడ్జెట్‌తో!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>