కలం, వెబ్ డెస్క్: టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఆ కాంబినేషన్‌లో ‘ఎప్పుడు సినిమా వస్తుందా’ అని అభిమానులే కాదు.. ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటి కాంబినేషన్‌లో అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబో ఒకటి. వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. వీరి కాంబినేషన్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్ ఇది. టాలీవుడ్ వర్గాల ప్రకారం.. అల్లు అర్జున్ (Allu Arjun), త్రివిక్రమ్ మరోసారి కలిసి పనిచేయబోతున్నారు. ఇది వారికి నాలుగవ ప్రాజెక్ట్.
టాలీవుడ్‌లో ఇంతకుముందు చూడనివిధంగా రూ.1000 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. ఇండియన్ సినిమాలోనే (Pan India) గొప్ప పౌరాణిక చిత్రాల్లో ఒకటిగా రాబోతున్నట్టు తెలుస్తోంది. పవర్‌ఫుల్ స్టోరీ, గ్రాండ్ విజువల్స్, అబ్బురపరిచే టెక్నాలజీతో ఈ సినిమా తెరకెక్కనుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ 2027 ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశాలున్నాయి.
టాలీవుడ్‌లో అల్లు అర్జున్, త్రివిక్రమ్(Trivikram) కాంబినేషన్‌కు మంచి గుర్తింపు ఉంది. వీరి కాంబోలో వచ్చిన ‘అల వైకుంఠపురములో‘ మూవీ ఎవర్‌గ్రీన్‌గా నిలిచింది. బన్నీ నటన, స్టెప్పులు, పాటలు ప్రేక్షకులను ఫిదా చేశాయి. టాలీవుడ్‌లో అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. దాదాపు ఐదేళ్ల తర్వాత వీరి కాంబినేషన్‌లో సినిమా వస్తుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం అల్లు అర్జున్(Allu Arjun) అట్లీ మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం విడుదల తేదీని ఇప్పటివరకు ప్రకటించలేదు. ఇక ‘పుష్ప 2’ వచ్చే ఏడాది జనవరి 16న జపాన్‌లో విడుదల కానుంది.
Read Also: సల్మాన్‌ఖాన్ ఫామ్‌హౌస్‌లో ధోనీ, ధిల్లాన్ సందడి.. రచ్చ రచ్చే!
Follow Us On: Youtube


