epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

అనసూయ రుణం తీర్చుకుంటా: శివాజీ

కలం, వెబ్ డెస్క్: సినీ హీరో శివాజీ(Hero Shivaji) తన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించారు. హీరోయిన్‌ల డ్రెస్సింగ్ పై చేసిన వ్యాఖ్యలు ఎవరినీ టార్గెట్‌ చేయడానికి కాదని వివరణ ఇచ్చారు. కేవలం సంస్కృతి, సమాజ బాధ్యతల పరంగా మాత్రమే మాట్లాడటమే ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. తన 30 ఏళ్ల కెరీర్‌లో ఎప్పుడూ హద్దులు దాటలేదని వివరించారు. స్టేజీపై ఉపయోగించిన రెండు అసభ్య పదాలకు ఆయన క్షమాపణలు తెలిపారు. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఈవెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ మాటాలకు రియలైజ్ అయినట్లు వెల్లడించారు.  తప్పుగా మాట్లాడానని అనిపించిన తర్వాత మొదటగా తన భార్యకు క్షమాపణ చెపినట్లు పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో హీరోయిన్లను అసభ్యంగా తాకుతూ ఉన్న కొన్ని సంఘటనలు తన దృష్టికి వచ్చాయని.. వాటిని ఉద్దేశించే చీర కట్టుకుని వస్తే ఇలాంటివి తగ్గుతాయనే ఉద్దేశంతో తాను మాట్లాడానని వివరణ ఇచ్చారు.

ఆ వ్యాఖ్యల పట్ల బాధపడుతున్నాని, అయితే తన స్టేట్ మెంట్ లో మాత్రం తప్పులేదన్నారు. అనంతరం తన వ్యాఖ్యలపై అనసూయ చేసిన కామెంట్స్ పై కూడా ఆయన స్పందిస్తూ ఘాటైన కౌంటర్ ఇచ్చారు. ‘యాంకర్ అనసూయ(Anasuya) అసలు ఈ వివాదంలోకి ఎందుకు వచ్చారో అర్థం కావడం లేదు. మీరు నా ఇన్ సెక్యూరిటీ గురించి మాట్లాడారు. మా హీరోయిన్లను ఇబ్బంది పెట్టడం ద్వారా వారికి జరగరానిది జరిగితే..? దారుణమైన పరిస్థితులు వస్తాయని ఇన్ సెక్యూరిటీగా ఫిల్ అవుతూనే ఉన్నాను. నా మీద చూపించిన మీ విశాల హృదయానికి ధన్యవాదాలు. తొందరలోనే మీ రుణం తీర్చుకునే అవకాశం కూడా నాకు ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నా‘ అంటూ శివాజీ సెటైర్లు వేశారు. అయితే శివాజీ (Hero Shivaji) కౌంటర్ కు యాంకర్ అనసూయ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.

Read Also: రష్మికను విజయ్​ బీట్​ చేస్తాడా?

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>