విజయ్, రష్మిక(Rashmika Mandanna) నిశ్చితార్థం అయిపోయినట్టు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ మీడియా మొత్తానికి ఈ విషయం లీక్ అయ్యింది. అయితే తాజాగా రష్మిక ఈ విషయంపై మరింత క్లారిటీ ఇచ్చేసింది. తాజాగా ఆమె ది గరల్ ఫ్రెండ్ మూవీ ప్రమోషన్లలో భాగంగా అనేక చానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అభిమానులతో చిట్‌చాట్‌లో పాల్గొన్న రష్మిక పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
‘ప్రపంచం మొత్తం నాకెదురుగా ఉన్నా కూడా నా కోసం నిలబడే వ్యక్తి కావాలి. నన్ను లోతుగా అర్థం చేసుకునే, నా కోణం నుంచి విషయాలను చూడగలగాలి. అన్ని పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోగల వ్యక్తి నాకు కావాలి. మంచి మనసు, నిజాయితీ ఉన్న వ్యక్తి నా కోసం యుద్ధం చేయగలగాలి. అలాంటి మనిషిని కనుక్కోవడానికి నేను ఎంత దూరమైనా వెళ్తా. అవసరమైతే యుద్ధరంగంలో తూటాకైనా ఎదుర్కొంటా” అని చెప్పారు.
‘డేట్ చేస్తే ఎవరితో చేస్తారు? పెళ్లి చేసుకుంటే ఎవరిని చేసుకుంటారు?’ అని మరో అభిమాని అడగ్గా రష్మిక(Rashmika Mandanna) నవ్వుతూ, “డేట్ చేస్తే యానిమేషన్ క్యారెక్టర్ నరుటోతో చేస్తా, ఎందుకంటే ఆ పాత్ర నాకు చాలా ఇష్టం. కానీ పెళ్లి చేసుకుంటే విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)ని చేసుకుంటా” అని సమాధానమిచ్చారు. ఆమె ఈ మాటలు చెప్పగానే స్టూడియోలో ఉన్నవారు కంగ్రాట్స్ అంటూ హర్షం వ్యక్తం చేశారు.
ఇక అక్టోబర్ 3న రష్మిక, విజయ్‌ల నిశ్చితార్థం జరిగినట్లు గత నెలలో వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై రష్మిక పరోక్షంగా స్పందిస్తూ, “మీరు అనుకుంటున్నది నిజమే, సమయం వచ్చినప్పుడు చెబుతాను” అని అన్నారు. తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఆమె విజయ్‌తో పెళ్లి వార్తలకు మరింత బలం చేకూర్చారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి వివాహం జరుగనున్నట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
Read Also: ‘శివ’ ఎందుకంత ప్రత్యేకం?
Follow Us on : Pinterest

