epaper
Tuesday, November 18, 2025
epaper

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. ఈ నెల 11న సెలవు

జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది. పోలింగ్ జరగనున్న నవంబర్ 11వ తేదీన నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, సంస్థలు, పాఠశాలలకు సెలవు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్‌ కలెక్టర్‌ హరిచందన శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

పోలింగ్‌కు ఒకరోజు ముందు, అంటే నవంబర్ 10న కేవలం పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేసిన పాఠశాలలు, కార్యాలయాలకు మాత్రమే సెలవు వర్తిస్తుందని స్పష్టం చేశారు. పోలింగ్ రోజున నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని సంస్థలకు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనున్న నవంబర్ 14వ తేదీన, కౌంటింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేసిన ప్రదేశాలకు మాత్రమే సెలవు ఉండనుంది. ఈ సెలవు దినాల్లో పనిచేసే ఉద్యోగులకు పెయిడ్ హాలిడే మంజూరు చేయాలని యాజమాన్యాలను ఆదేశించారు.

జూబ్లీహిల్స్(Jubilee Hills) లో ఉప ఎన్నిక సజావుగా, శాంతియుతంగా సాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ చర్య ద్వారా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కలగనున్నది. ఈ సారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోలింగ్ శాంత పెంచేందుకు ప్రయత్నం చేస్తామని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.

Read Also: తెలంగాణలో గ్రామీణ రోడ్లకు మహర్దశ..

Follow Us on: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>