Mobile Popup Ad
Mobile Popup Ad

SIRపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: రామ్‌చందర్ రావు

కలం, వెబ్ డెస్క్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టమైన తీర్పును భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామ్‌చందర్ రావు (Ramchander Rao) అన్నారు. ఓటర్ల ప్రక్షాళన దిశగా కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్‌ను తీసుకువచ్చిందని తెలిపారు. అటు కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లీస్ పార్టీ నేతలు ప్రజలకు ఎస్ఐఅర్‌పై తప్పుడు సమాచారం ఇస్తున్నారని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ్ మహాభియాన్‌లో భాగంగా నిర్వహించిన జిల్లా ప్రశిక్షణ్ వర్గ్ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో రామ్ చందర్ రావు బీజేపీ జెండాను ఆవిష్కరించారు. బీజేపీ జెండా సేవ, త్యాగం, క్రమశిక్షణ, దేశం పట్ల అచంచలమైన నిబద్ధతకు ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. ప్రజల కోసం నిరంతరం కృషి చేయాలని, భారతమాత సేవకు తమను అంకితం చేసుకోవాలని ప్రతి కార్యకర్తకు ఇది స్ఫూర్తినిస్తుందని తెలిపారు. అనంతరం ప్రశిక్షణ్ వర్గ్‌లో రంగారెడ్డి జిల్లా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.

ప్రధాని మోదీనాయకత్వంలో ప్రతి బీజేపీ కార్యకర్త “నేషన్ ఫస్ట్” స్ఫూర్తితో పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను చివరి వ్యక్తి వరకు చేరవేయడం తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు అయినా, యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు దిశగా అడుగులు అయినా.. బీజేపీ తన సిద్ధాంతపరమైన కట్టుబాట్లను నెరవేర్చడంలో ఎప్పుడూ ముందంజలో ఉందని కొనియాడారు. ఉత్తరాఖండ్, గోవా, అస్సాం రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలు ఇప్పటికే ఈ దిశగా కీలకమైన చర్యలు తీసుకున్నాయని ఆయన (Ramchander Rao) వివరించారు.

Read Also: పెట్టుబడులు ఆకర్షించడానికి రీల్స్ చేస్తున్న మంత్రి..!

Read Also: పిల్లల్ని కనడం లేదు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>