Mobile Popup Ad
Mobile Popup Ad

పెట్టుబడులు ఆకర్షించడానికి రీల్స్ చేస్తున్న మంత్రి..!

కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా మంత్రి కీర్తన (Minister Keerthana) కార్పొరేట్ స్టైల్ తరహా రీల్స్ చేస్తున్నారు. పాత సాంప్రదాయ ప్రసంగాలు పక్కన పెట్టి కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు. పెట్టుబడుదారులను ఆకర్షించడానికి హిందీ మాట్లాడడంతో పాటు గ్లోబల్ లెవల్ లో కనెక్ట్ అయ్యే రాష్ట్రంగా తమిళనాడు రూపొందుతోంది.

ఈ క్రమంలో యువతను ఎక్కువగా ఆకర్షించే సోషల్ మీడియా ద్వారా పెట్టుబడులను తీసుకురావడం కోసం కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు మంత్రి కీర్తన. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఇలా చేయడం ద్వారా యువత, ప్రజలు, పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు వీలుగా ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న సదుపాయాలు, పెట్టుబడులకు అనుకూలతలను మంత్రి కీర్తన ఇంగ్లీష్ లో వివరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ కొత్త పద్దతి బాగుందంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>