కలం, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ (West Bengal) సరిహద్దుల్లో రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక అడుగులు వేశాయి. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి ప్రతిపాదిత 600 ఎకరాల భూమిలో భాగంగా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే 142.79 ఎకరాల భూమిని సరిహద్దు భద్రతా దళానికి (BSF) అప్పగించింది. దీంతో ఫెన్సింగ్ పనులు ఊపందుకున్నాయి. ఈ పరిణామం చొరబాట్లను నిరోధించడంలో ఎంతో కీలకం కానుంది.
ఇదే సమయంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కఠినమైన ఉత్తర్వులు జారీ చేసింది. సరిహద్దుకు ఇరువైపులా భద్రతను కట్టుదిట్టం చేసేందుకు వీలుగా, బోర్డర్ లైన్ నుండి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలు, భవనాలన్నింటినీ కూల్చివేయాలని ఆదేశించింది. సరిహద్దు రక్షణలో ప్రజల ఓటు ఎంతటి కీలక మార్పును తీసుకువస్తుందో ఈ తాజా నిర్ణయాలు నిరూపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సరిహద్దు ఫెన్సింగ్ పనులు వేగంగా పూర్తి చేయడం ద్వారా దేశ భద్రతకు మరింత భరోసా లభించనుంది.
Read Also: మనస్ఫూర్తిగా రాజీనామా చేస్తున్నా.. సిద్ధరామయ్య భావోద్వేగ వ్యాఖ్యలు
Read Also: పిల్లల్ని కనడం లేదు

