కలం, నల్లగొండ బ్యూరో: భువనగిరి (Bhuvanagiri) పట్టణంలోని తారకరామనగర్‌లో ప్రియాన్స్ అనే నాలుగేళ్ల బాలుడు వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడటంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) స్పందించారు. భువనగిరి జిల్లా కలెక్టర్‌తో పాటు మున్సిపల్ అధికారులతోనూ ఫోన్‌లో మాట్లాడారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. బాలుడు ప్రియాన్స్ తండ్రి రాహుల్‌తో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. బాలుడి చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.
ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకోగానే ప్రియాన్స్‌ను పరామర్శించి వ్యక్తిగతంగా కుటుంబానికి అండగా నిలుస్తానని చెప్పారు. ప్రస్తుతం వీధి కుక్కల దాడిలో గాయపడిన బాలుడికి యశోద, ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్స్‌లో చికిత్స జరుగుతోందన్నారు. యానిమల్ బర్త్ కంట్రోల్ అనే చట్టాన్ని తీసుకొచ్చి వీధి కుక్కల సంఖ్యను కంట్రోల్ చేయాలని సుప్రీం కోర్టు చెప్పిందని గుర్తు చేశారు. వీధి కుక్కల పట్ల మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ప్రజాప్రతినిధులు, ప్రజలు తమ ఏరియాల్లో వీధి కుక్కలు ఎక్కువగా సంచరిస్తుంటే అధికారులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. భువనగిరిలో బాలుడు ప్రియాన్స్ పై వీధి కుక్కల దాడి ఘటన చూస్తుంటే మనసు చలించే విధంగా ఉందని ఎంపీ చామల (Chamala Kiran Kumar Reddy) ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: 35 ఏళ్లకే ప్రధానిగా : బాధ్యతలు చేపట్టిన బాలేంద్ర షా
Follow Us On: Instagram

