కలం, వెబ్ డెస్క్ : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం (Bhadrachalam Temple) అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలు రూపొందించింది. ఈ నేపథ్యంలో రూ.351 కోట్లతో చేపట్టనున్న ఆలయ విస్తరణ తొలి దశ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, వాకిటి శ్రీహరితో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా రూ.75 కోట్లతో గోదావరి ఘాట్ అభివృద్ధి, రూ.180 కోట్లతో ఆలయ విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన, రూ.96 కోట్లతో ఆలయ పరిసరాల అభివృద్ధి చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే భద్రాచలం (Bhadrachalam Temple) మరింత ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందనుంది.
ఇదే సమయంలో భద్రాచలం మిథిలా స్టేడియంలో ఘనంగా నిర్వహించిన శ్రీ సీతారామచంద్ర స్వామి తిరుకళ్యాణ మహోత్సవం భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ముంచెత్తింది. ఈ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ తిరుకళ్యాణ మహోత్సవంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వేలాది మంది భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వామివారి ఆశీస్సులు పొందారు.
Read Also: పార్టీ లాంచింగ్ డేట్ ప్రకటించిన కవిత
Follow Us On: Instagram

