Mobile Popup Ad
Mobile Popup Ad

‘పెద్ది’ ప్రభావం.. రామ్ చరణ్–సుకుమార్ మూవీ ఆలస్యం!

కలం, వెబ్ డెస్క్: రామ్ చరణ్‌ (Ram Charan), సుకుమార్ కాంబోలో రాబోతున్న ‘RC17’ మూవీ షూటింగ్ మరింత ఆలస్యమయ్యేలా ఉంది. దసరా వరకు స్క్రిప్ట్ పనులు జరగనున్నాయని.. ఆ తరువాతే సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు టాలీవుడ్ సర్కిళ్లలో చర్చ జరుగుతోంది. ‘రంగస్థలం’ భారీ హిట్ కొట్టడమే కాకుండా క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. రెండోసారి రాబోతున్న వీరి కాంబోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు ఏమాత్రం తగ్గకుండా వినూత్న కథను సుకుమార్ సిద్ధం చేశారట. వచ్చే మూడు నెలల్లో మొత్తం స్క్రిప్ట్ ఫైనల్‌ చేయబోతున్నారు. రామ్ చరణ్ పాత్ర చాలా స్టైలిష్‌గా ఉండబోతుందట.

పెద్ది మూవీ ఫలితంతోనే..

మూవీ షూట్ ఆలస్యానికి మరో కారణం కూడా ప్రధానంగా ఫిలింనగర్ సర్కిళ్లలో వినిపిస్తోంది. ‘పెద్ది’ (Peddi) మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టినప్పటికీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. రామ్ చరణ్ (Ram Charan) నటనకు మాత్రం ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమా కోసం ఒళ్లు హూనం చేసుకున్నాడు. దీంతో తనకు కూడా కనీసం మూడు నెలల పాటు విశ్రాంతి కావాలని సుకుమార్‌కు చెప్పినట్లు టాక్. పెద్ది రిజల్ట్‌ నేపథ్యంలో సుకుమార్ కూడా మరింత సమయం తీసుకుని స్క్రిప్ట్‌లో ముందు అనుకున్న వాటికి మార్పులు చేర్పులు చేస్తున్నట్లు ఇన్ సైడ్ వర్గాల సమాచారం. ఈ ఏడాది చివర్లో షూటింగ్ పూర్తి స్థాయిలో ప్రారంభమైతే.. 2027 చివరలోనే విడుదల ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

Read Also: కోపం కాదు.. కమ్యూనికేషన్ ముఖ్యం: నాగ్ అశ్విన్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>