కలం, మహబూబ్ నగర్ బ్యూరో: పోలీసు సిబ్బంది ఎల్లప్పుడూ శారీరకంగా దృఢంగా, మానసికంగా అప్రమత్తంగా ఉండి క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ జానకి (SP Janaki), సూచించారు. శనివారం మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం కవాతు మైదానంలో నిర్వహించిన వారాంతపు కవాతుకు జిల్లా ఎస్పీ హాజరై పరేడ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా కవాతులో పాల్గొన్న అధికారులు, పోలీసు సిబ్బందిని ఉద్దేశించి ఎస్పీ మాట్లాడారు.
పోలీసు విధులు అత్యంత బాధ్యతాయుతమైనవని, వాటిని సమర్థవంతంగా నిర్వర్తించేందుకు శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, అప్రమత్తత అత్యంత అవసరమని ఎస్పీ (SP Janaki) తెలిపారు. ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది ప్రతిరోజూ వ్యాయామం, పరేడ్, ఫిట్నెస్ కార్యక్రమాల్లో క్రమం తప్పకుండా పాల్గొని తమ శారీరక సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ప్రజలకు మెరుగైన, నాణ్యమైన పోలీసు సేవలు అందించాలంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక దృఢత్వం కూడా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.
విధుల నిర్వహణలో సమయపాలన, అంకితభావం, నిజాయితీ, క్రమశిక్షణను పాటిస్తూ ప్రజలతో స్నేహపూర్వకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి పోలీసు సిబ్బంది తమ సేవల ద్వారా శాఖ ప్రతిష్ఠను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్.బి.రత్నం, ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీసీఆర్బీ డీఎస్పీ రమణా రెడ్డి, వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య, ఆర్ఐలు కృష్ణయ్య, నగేష్, అశోక్ కుమార్, రూరల్ సబ్ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్‌తో పాటు ఇతర అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Also Read : నారాయణఖేడ్ ఫామ్ ల్యాండ్స్ మాయాజాలం!
Follow Us On: X(Twitter)

