కలం, నిర్మల్: గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారుల నిర్మాణానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ముధోల్ ఎమ్మెల్యే (Mudhole MLA) పవార్ రామారావు పటేల్ (Pawar Ramarao Patel) తెలిపారు. శనివారం కుబీర్ (Kubeer) మండలంలోని కుబీర్ – దోడర్న తండా రహదారి నిర్మాణ పనులను రూ. 98 లక్షల నాన్ గ్రాంట్ ప్లాన్ నిధులతో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే (MLA Pawar Ramarao) మాట్లాడుతూ.. భైంసా నుంచి నిఘ్వ – మహారాష్ట్ర సరిహద్దు వరకు రూ.22 కోట్లతో రహదారి నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిపారు. అలాగే రూ.42 కోట్ల నిధులతో సిరిపెల్లి నుంచి పల్సి, పార్థి (కే) మీదుగా కుబీర్ వరకు డబుల్ లైన్ రహదారి నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయిందని త్వరలో పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించి ప్రజల ప్రయాణాన్ని సులభతరం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Also Read : నారాయణఖేడ్ ఫామ్ ల్యాండ్స్ మాయాజాలం!
Follow Us On : WhatsApp

