Mobile Popup Ad
Mobile Popup Ad

బోనాల జాతరకు వేళాయే.. ముఖ్యమైన బోనాల తేదీలివే!

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దంగా నిలిచే ఆషాఢ బోనాల (Bonalu) ఉత్సవాలకు ముహూర్తం ఖరారైంది. సికింద్రాబాద్‌లోని ప్రసిద్ధ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాల ఉత్సవాలను ఆగస్టు 2న వైభవంగా నిర్వహించనున్నారు. జులై 19న ఘటాల ఊరేగింపుతో ఈ ఉత్సవాలకు అధికారికంగా ప్రారంభమవుతాయి. ప్రధాన ఘట్టమైన అమ్మవారికి బోనాల సమర్పణ ఆగస్టు 2న జరగనుంది. ఆ మరుసటి రోజు ఆగస్టు 3న ‘రంగం‘ (భవిష్యవాణి) ఉంటుంది. ఈ ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలను ఆలయ ఈఓ మనోహర్ రెడ్డి ఇప్పటికే ప్రజాప్రతినిధులకు అందజేశారు. మరో నెలరోజుల్లో నగరంలో ఈ బోనాల జాతరలు ప్రారంభం కానుండటంతో భక్తులలో ఇప్పుడే కోలాహలం మొదలైంది.

హైదరాబాద్ నగరంలో జరిగే బోనాల (Bonalu) ఉత్సవాలకు వందల ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఈ పండుగలో భాగంగా మొట్టమొదటి బోనాన్ని గోల్కొండ కోటలోని జగదాంబికా అమ్మవారికి సమర్పించడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. ఆషాఢ మాసం ప్రారంభమైన తొలి గురువారం లేదా ఆదివారం గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>