కలం, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) వరుస విజయాలతో దూసుకుపోతున్న తరుణంలో ఒక అనూహ్య వివాదం వెలుగులోకి వచ్చింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ టీమ్ మేనేజర్ రోమీ భిందర్ (Romi Bhinder) డగౌట్‌లో కూర్చుని మొబైల్ ఫోన్ వాడుతూ కెమెరాలకు చిక్కారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం మ్యాచ్ జరుగుతున్న సమయంలో డగౌట్‌లో మొబైల్ వాడటం నిషిద్ధం. దీంతో ఆయనపై బీసీసీఐ క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఐపీఎల్ 2026 ప్రోటోకాల్ ప్రకారం.. టీమ్ మేనేజర్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఫోన్ వాడుకోవచ్చు కానీ, డగౌట్‌లో వాడటం నిబంధనలకు విరుద్ధం. బీసీసీఐ (BCCi) అధికారి ఒకరు ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, భిందర్ ‘ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా’ (PMOA) ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారని పేర్కొన్నారు. రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) జట్టు స్థాపన నుండి అసోసియేట్ అయి ఉన్న భిందర్‌కు ఈ యాంటీ కరప్షన్ నిబంధనలు తెలియకపోయే అవకాశం లేదని అధికారులు భావిస్తున్నారు. మ్యాచ్ రిఫరీ, యాంటీ కరప్షన్ యూనిట్ (ACU) ఇచ్చే నివేదిక ఆధారంగా ఆయనకు హెచ్చరిక జారీ చేయాలా లేదా మ్యాచ్ నిషేధం విధించాలా అనే దానిపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుంది.
Read Also: నో కాంప్రమైజ్.. ఇదే జెన్ జీ ఫార్ములా!!
Follow Us On: Instagram

