Mobile Popup Ad
Mobile Popup Ad

సంజూ శాంసన్‌పై కుంబ్లే ప్రశంసల వర్షం

కలం, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓపెనర్ సంజూ శాంసన్ వీరవిహారం చేశాడు. టోర్నీలో తొలి సెంచరీ చేసి తన సత్తా చాటుకున్నాడు. అంతేకాకుండా వరుస ఓటములతో సతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు తొలి విజయం అందించడంలో కీలకంగా నిలిచాడు. కేవలం 56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 115 పరుగులు చేసిన సంజూ ఆట తీరుపై భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే (Kumble) ప్రశంసలు కురిపించారు.

సంజూ శాంసన్ ఇన్నింగ్స్‌ను విశ్లేషిస్తూ.. అతను మైదానం నలుమూలలా సమానంగా పరుగులు సాధించడాన్ని కుంబ్లే అభినందించారు. సంజూ కేవలం ఒక వైపు మాత్రమే కాకుండా ఆన్-సైడ్, ఆఫ్-సైడ్ వైపు సమానమైన పట్టును ప్రదర్శించాడని పేర్కొన్నారు. బంతిని స్ట్రైట్ బ్యాట్‌తో ఎదుర్కోవాలనే సంజూ ఆలోచనా విధానం, షార్ట్ పిచ్ బంతులకు తగ్గట్టుగా చేసుకున్న సర్దుబాట్లు పరుగుల వేటను సులభతరం చేశాయని వివరించారు. ముఖ్యంగా 2026 టీ20 ప్రపంచకప్‌లో మూడుసార్లు తృటిలో సెంచరీ చేజార్చుకున్న సంజూ, ఈసారి దానిని భారీ ఇన్నింగ్స్‌గా మార్చడం జట్టుకు, అతనికి శుభపరిణామమని కుంబ్లే (Kumble) అభిప్రాయపడ్డారు.

ఈ విజయం చెన్నై జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని మరో ప్యానలిస్ట్ చెతేశ్వర్ పుజారా అన్నారు. మొదటి మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన తర్వాత సిబ్బందితో సహా ప్రతి ఆటగాడు ఈ గెలుపు కోసం ఎంతగానో ఎదురుచూశారని ఆయన గుర్తుచేశారు. ఐపీఎల్ వంటి టోర్నీల్లో గెలుపు ఊపు చాలా ముఖ్యమని, ఇది జట్టును ప్లేఆఫ్స్ దిశగా నడిపిస్తుందని పేర్కొన్నారు. గెలుపుతో జట్టులో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని పుజారా ముగించారు.

Read Also: నో కాంప్రమైజ్.. ఇదే జెన్ జీ ఫార్ములా!!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>