ఇంటర్ ఫలితాల్లో చివరి స్థానం ఆ జిల్లాదే!

క‌లం, వెబ్ డెస్క్‌: విద్యార్థులు ఎంత‌గానో ఎదురు చూసిన ఇంట‌ర్ ఫ‌లితాలు (Inter Results) వ‌చ్చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా 66.20 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణుల‌య్యారు. ఎప్ప‌టిలాగానే ఫలితాల్లో బాలిక‌ల‌దే పైచేయిగా నిలిచింది. అయితే జిల్లాల వారీగా ప‌రిశీలిస్తే ఫ‌లితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. రాజ‌న్న‌ సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లా ఇంట‌ర్ ఫ‌లితాల్లో రాష్ట్రంలోనే చివరి స్థానంలో నిలిచింది. అటు ఫ‌స్ట్ ఇయ‌ర్‌, ఇటు సెకండ్ ఇయ‌ర్ రెండింటిలోనూ లాస్ట్ ప్లేస్ కొట్టేసింది. ఫ‌స్ట్ ఇయ‌ర్‌లో 49.05 శాతం ఉత్తీర్ణ‌త సాధించ‌గా, సెకండ్ ఇయ‌ర్‌లో 58.69 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది. ఇక మేడ్చ‌ల్ (Medchal) జిల్లా ఫ‌లితాల్లో ఆప్ ప్లేస్‌లో నిలిచింది. ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ ఫ‌లితాల్లో 77.31 శాతం ఉత్తీర్ణ‌త న‌మోద‌వ‌గా, సెకండ్ ఇయ‌ర్‌లో 82.73 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది.

ఇక ఫ‌స్ట్ ఇయ‌ర్ ఫ‌లితాల్లో (Inter Results) టాప్ టెన్‌లో వ‌రుస‌గా రంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, ములుగు, కరీంనగర్, హనుమ‌కొండ, హైదరాబాద్-1, కొమురంభీం ఆసిఫాబాద్, హైదరాబాద్-III లు స్థానం ద‌క్కించుకున్నాయి. మ‌రోవైపు సెకండ్ ఇయ‌ర్ ఫ‌లితాల్లో టాప్ టెన్‌లో వ‌రుస‌గా జయశంకర్ భూపాలపాల్లి, కొమురంభీం ఆసిఫాబాద్, ములుగు, రంగారెడ్డి, ఖమ్మం, కరీంనగర్, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల స్థానం ద‌క్కించుకున్నాయి.

Read Also: త్వరలో పాదయాత్ర చేస్తా.. కేటీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>