కేసీఆర్‌పై ఎంపీ చామల ఫైర్

కలం, వెబ్ డెస్క్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ తన పాలనలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా సరిగ్గా నెరవేర్చలేదని మండిపడ్డారు. కేవలం మాటలతోనే కాలక్షేపం చేశారని ఆరోపించారు. ప్రజల బతుకులు బాగుపడలేదని, కేసీఆర్ (KCR) కుటుంబానికి మాత్రం ఫామ్‌హౌస్‌లు, వేల ఎకరాల భూములు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన నిలదీశారు. రానున్న రోజుల్లో ఎన్నికలు ఎప్పుడొచ్చినా మళ్ళీ తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ భ్రమల్లో బతుకుతున్నారని, ప్రజలు ఇప్పటికే ఆయనను తిరస్కరించారంటూ ఎంపీ చామల సెటైర్లు వేశారు.

Read Also: మళ్లీ టీఆర్ఎస్… కేటీఆర్ మాటల వెనుక మర్మమేమిటి?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>