కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలో ఎంఐఎం నేతల (MIM Leaders) తీరుపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నగరంలోని పోలీసులు, మున్సిపల్ అధికారులు ఎంఐఎం నాయకులకు భయపడి పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇటీవల జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు, పోలీసులపై ఎంఐఎం నేతలు దౌర్జన్యానికి దిగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం హైదరాబాద్ సీపీ సజ్జనార్ (CP Sajjanar) జారీ చేసిన ఆదేశాలను కూడా అధికారులు లెక్కచేయకపోవడం విచిత్రంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యంగా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై రాజాసింగ్ ఘాటుగా స్పందించారు. తనను చూసి అధికారులు, పోలీసులు పారిపోయారని ముంతాజ్ ఖాన్ చెప్పడం ఆశ్చర్యకరమని, ఇది వ్యవస్థల బలహీనతను సూచిస్తోందని పేర్కొన్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న ఫుట్‌పాత్‌లను ఎంఐఎం నేతలు కబ్జా చేయించడమే కాకుండా, అక్కడ షాపులు ఏర్పాటు చేయించి అక్రమంగా కిరాయిలు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఈ ఆక్రమణల పర్వం తన నియోజకవర్గమైన గోషామహల్‌లో కూడా కొనసాగుతోందని రాజాసింగ్ (Raja Singh) అన్నారు. చట్టాన్ని గౌరవించే తన లాంటి ప్రజాప్రతినిధులు కూడా ఎంఐఎం నేతల మాదిరిగానే ఆక్రమణలను ప్రోత్సహించాలా అని ఆయన అధికారులను ప్రశ్నించారు. అక్రమార్కుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన యంత్రాంగం ఇలా మౌనంగా ఉండటం సరికాదన్నారు.
Read Also: నాకు రేవంత్‌రెడ్డితో చర్చకు దిగే ఉద్దేశం లేదు: కేరళ సీఎం
Follow Us On : WhatsApp

