ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదు : ఇరాన్ ప్రెసిడెంట్

కలం, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రతరం అయింది. హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు తాను విధించిన గడువు ( భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 5:30 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8 గంటలు) సమీపిస్తుందని.. ఇరాన్ మొండివైఖరీ వీడకపోతే ఆ దేశ నాగరికత అంతరించిపోతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్‌ అధ్యక్షుడు (Iran President) పెజెష్కియాన్‌ స్పందించారు. ఈ సందర్భంగా ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదని తేల్చారు.

దేశం కోసం తాము దేనికైనా సిద్ధమని పెజెష్కియాన్‌ స్పష్టం చేశారు. తాము ప్రపంచంలో ఎక్కడైనా దాడి చేయగలమని హెచ్చరించారు. అంతేకాదు తనతో పాటు తన దేశ ప్రజలు ప్రాణ త్యాగానికి సిద్ధంగా ఉన్నారని, పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని వెల్లడించారు. తాము తాత్కాలిక ఒప్పందాలకు అంగీకరించబోమని తేల్చి చెప్పారు. దీంతో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పై చేస్తున్న యుద్ధం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనన్న ఆందోళన ప్రపంచ దేశాల్లో నెలకొంది.మూడో ప్రపంచ యుద్ధానికి నాంది పలికినట్లు అవుతుందేమోనని విశ్లేషకులు భయపడుతున్నారు.

Read Also: ఇరాన్‌లో సంపూర్ణ అధికార మార్పు: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>