పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న ది రాజాసాబ్(Raja Saab) జనవరి 9న రిలీజ్ అవుతోంది. తాజాగా మూవీ ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. రిలీజ్ కు ఇంకా చాలా టైమ్ ఉన్నా సరే ఇంత అడ్వాన్స్ గా ఎందుకు బుకింగ్స్ ఓపెన్ చేశారో అర్థం కావట్లేదు. చూస్తుంటే ఓవర్సీస్ లో ఎక్కువ వసూళ్లు రాబట్టాలనే టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. కానీ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఓపెన్ చేస్తే భారీ బజ్ పెరిగి టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయేవి.
కానీ ఇంత అడ్వాన్స్ గా ఓపెన్ చేయడం ఏంటో మరి. ఇక బుకింగ్ సైట్స్ లో రన్ టైమ్ 3 గంటల 14 నిముషాలుగా కనిపిస్తోంది. ఈ మధ్య ప్రభాస్ సినిమాలన్నీ 3 గంటలకు పైనే ఉంటున్నాయి. అవన్నీ హిట్ అవ్వడం ఇంకో ప్లస్ పాయింట్. అదే సెంటిమెంట్ రాజాసాబ్(Raja Saab) కు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ సారి ప్రభాస్ ప్రమోషన్లకు దూరంగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. రెండో వారం వీకెండ్ లో ట్రైలర్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఓపెన్ చేస్తారు కావచ్చు.
Read Also: రవీంద్రభారతిలో ఎస్పీ బాలూ విగ్రహంపై వివాదం
Follow Us On: X(Twitter)


