మొంథా తుఫాను(Cyclone Montha) ప్రభావం హైదరాబాద్‌పై భారీగా ఉంది. మంగళవారం రాత్రి తుఫాను తీరం దాటి.. బుధవారం ఉదయానికి తెలంగాణ బోర్డర్‌కు చేరుకుంది. ఈ తుఫాను కారణంగా ఖమ్మంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ మొంథా తుపాను ప్రభావంతో హైదరాబాద్(Hyderabad)లోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. గచ్చిబౌలి, ఖాజాగూడ, నానక్‌రాంగుడ, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, గాంధీనగర్, కవాడిగూడ, భోలక్‌పూర్, అంబర్‌పేట్, కాచిగూడ, నల్లకుంట, బర్కత్‌పురా, బీఎన్‌రెడ్డి నగర్, జవహర్ నగర్, చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి, దోమలగూడలో వర్షం కురుస్తోంది. దీంతో రహదారులపై నీరు నిలిచి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
Read Also: జీవితంలో చేయాల్సి చాలా ఉంది: రోహిత్

