తన కెరీర్‌పై రోహిత్ శర్మ(Rohit Sharma) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను రానున్న జీవితంలో చేయాల్సింది చాలా ఉందని అన్నాడు. ఆస్ట్రేలియాతో మూడో వన్డేలా అద్భుత ప్రదర్శన కనబరిచిన రోహిత్.. తన సొంత రూల్స్, ట్రైనింగ్ బాగా పనిచేశాయన్నాడు. అందుకు ఆస్ట్రేలియాపై చేసిన 121 పరుగులు నిదర్శనమన్నాడు. ‘‘నాకు నా క్రికెట్ కెరీర్‌లో ఎప్పుడూ ఒక సిరీస్‌కు ముందు నాలుగు నెలల విరామం రాలేదు. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ముందు వచ్చిన గ్యాప్‌ను సద్వినియోగం చేసుకున్నా. నా పద్దతిలో, నా రూల్స్ ప్రకారం పనులు చేశా. అది నాకు బాగా పని చేసింది. మిగిలిన కెరీర్‌లో ఏం చేయాలో అర్థమైంది. నాలుగు నెలల గ్యాప్‌లో నాకు నేను టైమ్ కేటాయించుకున్నా. ప్రొఫెసనల్‌గా చేసేది కాకుండా.. జీవితంలో చేయాల్సింది చాలా ఉంటుందని అర్థం చేసుకున్నా’’ అని చెప్పాడు రోహిత్.
Read Also: బాలికల బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు.. అటెండర్‌పై వేటు

