epaper
Tuesday, November 18, 2025
epaper

మంత్రులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. అప్పటి వరకు హైదరాబాద్‌లోనే..!

తెలంగాణ మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) కీలక ఆదేశాలు ఇచ్చారు. నవంబర్ 9 వరకు హైదరాబాద్ వదిలి వెళ్లొద్దని చెప్పారు. జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉపఎన్నిక దగ్గర పడుతున్న క్రమంలో నియోజకవర్గంలో ప్రచారంపై సీఎం రేవంత్ రెడ్డి.. మంత్రులతో సమీక్షించారు. ఈ సందర్భంగానే ఆయన మంత్రులకు కీలక ఆదేశాలిచ్చారు. నియోజకవర్గంలో ప్రచార గడువు ముగిసే వరకు మంత్రులు నగరంలోనే ఉండాలని, ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అడగాలని తెలిపినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ నాయకులు, అనుబంధిత సంఘాల నాయకులు మంత్రులకు సహాయంగా పని చేయాలని తెలిపిన, అందరితో సమన్వయం చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.

Read Also: హైదరాబాద్‌లో మొదలైన ‘మొంథా’ ఎఫెక్ట్..

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>