epaper
Tuesday, November 18, 2025
epaper

అప్పుడే మూవీ టికెట్ రేట్ల పెంపుకు ఆమోదం: రేవంత్

సినిమా టికెట్ల రేటు పెంపుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) కీలక ప్రకటన చేశారు. పుష్ప-2 సినిమా సమయంలో సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటన సందర్భంగానే సినిమా టికెట్ రేట్లను పెంచడానికి అనుమతించమని రేవంత్ స్పష్టం చేశారు. ఆ తర్వాత సినీ పెద్దలు పలుమార్లు చర్చలు జరిపినా పెద్దగా లాభం లేకపోయింది. అయితే మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన రేవంత్ సన్మాన సభలో ఆయన టికెట్ రేట్లపై స్పందించారు.

‘‘టికెట్ ధరలు(Movie Ticket Price) పెంచడం వల్ల వచ్చిన ఆదాయంలో 20% సినీ కార్మికులకు ఇస్తామంటేనే.. టికెట్ ధరలు పెంచుకునేందుకు జీవో జారీ చేస్తాము’’ అని స్పష్టం చేశారు. అంతేకాకుండా సినీ కార్మికులకు ఆయన శుభవార్త చెప్పారు. అతి త్వరలో కృష్ణానగర్ ప్రాంతంలో సినీ కార్మికుల పిల్లలు చదువుకునేందుకు 3-4 ఎకరాల్లో కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాల నిర్మిస్తామని Revanth Reddy అన్నారు.

Read Also: తన వరుడిపై శ్రీలీల క్లారిటీ.. క్వాలిటీస్ ఇవే..

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>