epaper
Wednesday, February 18, 2026
epaper

మున్సిప‌ల్ ఫ‌లితాల‌పై రాహుల్ గాంధీ కీల‌క వ్యాఖ్య‌లు

క‌లం, వెబ్ డెస్క్‌: తెలంగాణ మున్సిప‌ల్ ఎన్నిక‌ల (Telangana Municipal Elections) ఫ‌లితాల‌పై కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందించారు. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్ వేదిక‌గా ఓ పోస్ట్ చేశారు. తెలంగాణలో జరిగిన మున్సిప‌ల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం ప్రజా అనుకూల ప్రభుత్వ విధానాలకు స్పష్టమైన మద్దతు అని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, గౌరవం, సమగ్ర అభివృద్ధి లక్ష్యాలతో అమలు చేస్తున్న ప్రభుత్వ విధానాలకు ప్రజలు మద్దతు తెలిపారన్నారు. ఈ విజయానికి కృషి చేసిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నాయకుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ విజయం పార్టీదే కాద‌ని, తెలంగాణ ప్రజలద‌ని రాహుల్ (Rahul Gandhi) త‌న పోస్టులో పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి అభివృద్ధి ఫలాలు అందే ప్రజా తెలంగాణ దిశగా కాంగ్రెస్ పార్టీ అంచ‌లంచెలుగా ఎదుగుతుంద‌ని రాహుల్ గాంధీ స్ప‌ష్టం చేశారు.

 Read Also: ‘సుప్రీం’ను మెప్పించి పది నిమిషాల్లో ఎంబీబీఎస్​ సీట్​ పట్టేశాడు​!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>