epaper
Wednesday, February 18, 2026
epaper

‘సుప్రీం’ను మెప్పించి పది నిమిషాల్లో ఎంబీబీఎస్​ సీట్​ పట్టేశాడు​!

కలం, వెబ్​డెస్క్​: దేశ అత్యున్నత న్యాయస్థానం.. ఓ కేసులో వాదనలు పూర్తయ్యాయి.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ సూర్యకాంత్​ సీట్లోంచి లేచేందుకు సిద్ధమవుతున్నారు.. ఇంతలో ‘టెన్​ మినిట్స్​ సర్​’ అంటూ ఓ గొంతు వినిపించింది.. ఆ గొంతు సీనియర్​ లాయర్లది కాదు, న్యాయకోవిదులది కాదు.. ఓ 19 ఏళ్ల యువకుడిది. అతని పేరు అథర్వ చతుర్వేది (Atharva Chaturvedi). అది అతనికి సంబంధించిన కేసే. అందుకే తానే స్వయంగా వాదనలు వినిపిస్తానని చీఫ్​ జస్టిస్​కు విజ్ఞప్తి చేశారు. ఆయన అంగీకరించారు. అంతే, ఆ పది నిమిషాలు ఆ యువకుడి రాతను మార్చాయి. అతని లక్ష్యానికి దారి చూపాయి. ఇంతకీ ఏమా టెన్​ మినిట్స్​ కథంటే..

అథర్వది మధ్యప్రదేశ్​లోని జబల్​పూర్​. డాక్టర్​ కోర్స్​ చదవడానికి రెండు సార్లు నీట్​ పరీక్ష రాసి, పాసయ్యాడు. 530 మార్కులు వచ్చాయి. అయినా, అతనికి సీట్​ ఇవ్వడానికి ప్రైవేటు కాలేజీలు అంగీకరించలేదు. కారణం.. ప్రైవేట్​ వైద్య కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్​ కోటా అమలు చేయడం లేదు. దీంతో సీట్​ దక్కలేదు.

దీనిపై మొదట ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాడు అథర్వ. అక్కడ తన కేసును తానే వాదించాడు. అయితే, అతనికి నిరాశే ఎదురైంది. పైగా, ‘ నువ్వు డాక్టర్​ కావాలనుకుంటున్నావ్, లాయర్​ కాదు’ అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో ఎలాగైనా సీట్​ సంపాదించాలనే లక్ష్యంతో సుప్రీంకోర్టుకు వెళ్లాడు అథర్వ. అక్కడ లాయర్​ను నియమించుకున్నారు. అయితే, ఫలితం అనుకూలంగా వచ్చేలా కనిపించలేదు. ఈ క్రమంలో ప్రధాన న్యాయమూర్తిని పది నిమిషాలు సమయం అడిగి, తన కేసును తానే వాదించుకున్నాడు.

అథర్వ (Atharva Chaturvedi) వాదనలు విన్న సీజేఐ సూర్యకాంత్ (CJI Surya Kant)​.. రాజ్యాంగంలోని ఆర్టికల్​ 142 కింద తనకున్న ప్రత్యేక అధికారాలను వినియోగిస్తూ, అథర్వకు సీట్​ ఇవ్వాలని ఆదేశించారు. ఆర్థికంగా బలహీన వర్గానికి(ఈడబ్ల్యూఎస్​)కు చెందిన నీట్​ అభ్యర్థులకు తాత్కాలికంగా ఎంబీబీఎస్​ ప్రవేశాలు కల్పించాలని మధ్యప్రదేశ్​ ప్రభుత్వాన్ని, నేషనల్​ మెడికల్​ కౌన్సిల్​ను ఆదేశించారు. దీంతో అథర్వకు ఎంబీబీఎస్​ సీట్​ వచ్చేందుకు రూట్​ క్లియరైంది.

కాగా, అథర్వ తండ్రి మనోజ్​ చతుర్వేది న్యాయవాది. అయితే, ఆయనెప్పుడూ హైకోర్టులో, సుప్రీంకోర్టులో వాదించలేదు. ఈ కేసులో స్పెషల్​ లీవ్ పిటిషన్​ వేయడం మొదలుకొని, అన్నీ ఆన్​లైన్​లోనే పూర్తి చేసిన అథర్వ, చివరికి తన కేసును తానే వాదించుకొని, పది నిమిషాల్లో సుప్రీంను మెప్పించి సీట్​ పట్టేశాడు.

Read Also: మున్సిప‌ల్ ఫ‌లితాల‌పై రాహుల్ గాంధీ కీల‌క వ్యాఖ్య‌లు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>