epaper
Wednesday, February 18, 2026
epaper

స్కూల్ మారుతాన‌న్న‌ విద్యార్థి.. చితకబాదిన వార్డెన్

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam)లో అమానుష ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. స్కూల్ మారుతాన‌ని చెప్పిన ఓ విద్యార్థిని హాస్ట‌ల్ వార్డెన్ చిత‌క‌బాదాడు. నగరంలోని రెజోనెన్స్ స్కూల్‌ (Resonance School)కు అనుబంధంగా ఉన్న హాస్టల్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. హాస్ట‌ల్‌లో పని చేసే వార్డెన్లు భార్గవ్ అనే విద్యార్థిని శనివారం దారుణంగా కొట్టారు విష‌యం తెలుసుకున్న విద్యార్థి త‌ల్లిదండ్రులు హాస్ట‌ల్‌కు రావ‌డంతో స్థానికంగా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. రెజోనెన్స్ స్కూల్‌లో ఏడవ తరగతి చదువుతున్న భార్గవ్ స్కూల్ కు అనుబంధంగా ఉన్న హాస్టల్‌లో ఉంటున్నాడు.

కొంత కాలంగా భార్గవ్ హాస్టల్‌లో ఉండను, హైద‌రాబాద్‌కు వెళ్లి చదువుకుంటానని చెప్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇంటికి పంపించాల‌ని కోరినందుకు వార్డెన్‌లు కొట్టారని బాధిత విద్యార్ది చెప్తున్నాడు. భార్గవ్‌ను కొట్టిన విషయం తెలుసుకున్న త‌ల్లిదండ్రులు హాస్టల్ దగ్గరికి వచ్చి యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. త‌మ కొడుకును కొట్టిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

Khammam
Khammam Resonance School

Read Also: పరకాల మున్సిపాలిటీలో 11మంది మహిళా కౌన్సిలర్లు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>