కలం, నిజామాబాద్ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే ఓటుకు నోటు కేసులో అండర్ ట్రయల్ లో ఉన్నారు.. ఆయన్నే ఎత్తుకెళ్తారు పోలీసులు అని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ (MP Arvind) వ్యాఖ్యానించారు. బండి సంజయ్ వారియర్ లాంటి వాడని అర్జునుడు రోల్ కు సెట్ అవుతారని చెప్పుకొచ్చారు. కృష్ణునిలా స్టీరింగ్ నా చేతిలో ఉండే దాకా ఓకే అంటూ సోషల్ మీడియాలో కృష్ణార్జునుల వైరల్ పోస్ట్ పై ఎంపీ అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ లో ఎంపీ అరవింద్ మీడియాతో మాట్లాడారు.
నిజామాబాద్ మేయర్ (Nizamabad Mayor) స్థానం కోసం తాము కాంగ్రెస్ లా దిగజారం అని స్పష్టం చేశారు. తాము ఒక ఐడియాలజీ తో ముందుకు వెళ్తున్నామని తేల్చి చెప్పారు. సంఖ్యలు కాదు.. పదవులు తమకు ముఖ్యం కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక బ్రోకర్ పార్టీ.. విషపు పురుగులు అన్న ఎంఐఎం తో పొత్తు ఎందుకని ప్రశ్నించారు. ఇందూరులో టెక్నికల్ గా ఫెయిల్ అయ్యాం.. ప్రాక్టికల్ గా గెలిచామని తెలిపారు. రెండేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని, అప్పుడు నిజామాబాద్ పేరును మారుస్తామని చెప్పుకొచ్చారు. ఇందూరు ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన అరవింద్ ప్రజల ఆశీస్సులతో రెండోసారి ఇందూరులో అతిపెద్ద పార్టీగా బీజేపీ ఏర్పడిందని ఆనందం వ్యక్తం చేశారు.
రెండు మూడు స్థానాల తేడాతో మేయర్ పీఠాన్ని దక్కించుకోలేక పోయామని ఎంపీ అరవింద్ (MP Arvind) చెప్పారు. తెలంగాణలో బీజేపీ (BJP) డామినేట్ పెరిగిందనీ. కాంగ్రెస్ పార్టీకి దీటైన పోటీ ఇస్తున్నామని పేర్కొన్నారు. పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కనిపించకుండా పోయిందని విమర్శించారు. నిజామాబాద్ లో బీఆర్ఎస్ కార్పొరేటర్ ఒకరు గెలిస్తే అతన్ని ఎత్తుకెళ్తున్నారని పోలీసులు ఇంటిముందు ఉన్నారని ఆరోపించారు. రేపటి రోజు రేవంత్ రెడ్డినే పోలీసులు ఎత్తుకెళ్లే రోజు వస్తుందని అన్నారు. ఓటుకు నోటు కేసు ఎందుకు స్లో అవుతుందో మేము కూడా ఫాలో చేస్తామన్నారు.
Read Also: అత్తాపూర్లో దారుణం.. బావను చంపిన బావమరుదులు
Follow Us On : WhatsApp


