హిమంత బిశ్వ శర్మ దేశంలో భారీ అవినీతిపరుడు: రాహుల్ గాంధీ

క‌లం, వెబ్ డెస్క్‌: అస్సాం సీఎం హిమంత బిశ్వ శ‌ర్మ (Himanta Biswa Sarma) దేశంలోనే అత్యం అవినీతిప‌రుడు అని కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీ అస్సాంలోని పలు ప్రాంతాల్లో నేడు పర్యటించారు. ప్రచార సభలు, ర్యాలీల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం హిమంత బిశ్వ శ‌ర్మ‌, బీజేపీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. బిశ్వ శర్మ దేశంలోనే అత్యంత అవినీతిపరుడ‌ని, అత్యంత సామాజిక విభేదాలను రెచ్చగొట్టే సీఎం అని విమ‌ర్శించారు. హిమంత శర్మ అసోం ప్రజలను మోసం చేసి, తప్పుదారి పట్టించార‌ని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలు ప్రజల ముందే ఉన్నాయ‌ని, అస్సాం ప్రజలు ఆయన అవినీతిని ఎప్పటికీ క్షమించర‌ని పేర్కొన్నారు. ఈ ఎన్నిక‌ల్లో హిమంత శ‌ర్మ‌కు, బీజేపీకి ప్ర‌జ‌లు బుద్ధి చెప్పాల‌ని పిలుపునిచ్చారు. అవినీతి ప‌రుల‌కు శిక్ష తప్పద‌ని స్ప‌ష్టం చేశారు.

అస్సాంలో (Assam) బీజేపీ ప్ర‌జ‌ల‌ను దారుణంగా మోసం చేసింద‌ని రాహుల్ (Rahul Gandhi) ఆరోపించారు. రాష్ట్రంలో అంబానీకి 8,060 ఎక‌రాలు, అదానీ సోలార్‌కు 11,160 ఎకరాలు, అదానీ థర్మల్‌కు 3,720 ఎకరాలు, అదానీ పవర్‌కు 868 ఎక‌రాలు, బాబా రామ్‌దేవ్‌కు 37,200 ఎక‌రాలు ఇచ్చార‌ని చెప్పారు. ఇదంతా బీజేపీ ప్ర‌జ‌ల‌ నుంచి తీసుకుని తమ స్నేహితులకు పంచిన భూముల‌ని వెల్ల‌డించారు. నరేంద్ర మోడీ, అమిత్ షా, హిమంత అసోంను బీజేపీకి ఏటీఎంలా మార్చేశార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు.

Read Also: బెంగాల్ ప్రజలకు ప్రధాని మోదీ కీలకహామీ

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>