కలం, నాగర్ కర్నూల్ : పేదల సంక్షేమం కోసం ముందుకు సాగుతున్నానని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ (Achampet MLA Chikudu Vamsi Krishna) అన్నారు. అచ్చంపేటలో నాల్గవ విడత మెగా సర్జికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అచ్చంపేట నియోజకవర్గాన్ని విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల్లో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నానని తెలిపారు. అచ్చంపేట ఏరియా హాస్పిటల్ కు త్వరలోనే అన్ని వసతులు సమకూరుస్తున్నామని చెప్పారు.
ఈ క్యాంపు ద్వారా ఇప్పటివరకు 300 మంది రోగులకు ఉచిత శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు. ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్న మిగిలిన వారికి కూడా త్వరలో ప్రత్యేకంగా మరో రోజు మెగా సర్జికల్ క్యాంపు నిర్వహించి ఉచిత ఆపరేషన్లు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అచ్చంపేటతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ మెగా సర్జికల్ క్యాంపును పెద్దఎత్తున వినియోగించుకొని నాణ్యమైన వైద్య సేవలు పొందారని సూచించారు.
నియోజకవర్గాన్ని విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల్లో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ తార సింగ్, డాక్టర్ ప్రభు, డాక్టర్ మహేష్, ప్రతిప్ రాజ్, బాల్ సింగ్, ఇతర మహిళ డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

