Mobile Popup Ad
Mobile Popup Ad

గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. మార్కెట్ లోకి 5 కిలోల సిలిండర్లు

కలం, వెబ్ డెస్క్ : వంట గ్యాస్ సిలిండర్ (LPG Cylinder) అనగానే మనకు ఇంట్లో వాడే సిలిండర్ లేదా రెస్టారెంట్లు, హోటళ్లలో వినియోగించేవే గుర్తుకు వస్తాయి. పెద్ద సైజులో ఉండే వీటిని మోయాలన్నా.. ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్లాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. ఈ క్రమంలో గ్యాస్ కంపెనీలు 5 కిలో సిలిండర్లను తీసుకువచ్చాయి. ఇటీవల గ్యాస్ సరఫరాలో అంతరాయం కలిగిన నేపథ్యంలో కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి. ఎలాంటి అడ్రస్ ప్రూఫ్స్ లేకుండానే వీటిని బుక్ చేసుకోవచ్చని తెలిపాయి. ఇండెన్, భారత్ గ్యాస్, హెచ్ పీ కంపేనీలు ఈ మార్కెట్లోకి ప్రవేశపెట్టాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఛోటు పేరుతో ఈ 5 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ను లాంచ్ చేయగా.. హెచ్ పీ కంపెనీ అప్పు పేరుతో ప్రవేశపెట్టింది.

గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే అడ్రస్ ఫ్రూఫ్, అప్లికేషన్ ఫామ్స్ నింపాల్సి వచ్చేది. కానీ, ఈ 5 కేజీల సిలిండర్లను (LPG Cylinder) తీసుకోవాలంటే ఎలాంటి అడ్రస్ ప్రూఫ్స్ లేకుండానే ఏజెన్సీల వద్దకు వెళ్లొచ్చు. 5 కిలోల సిలిండర్ల వల్ల అద్దె ఇండ్లల్లో ఉంటున్న వారు, విద్యార్థులు, ఉద్యోగులు, వలస కార్మికులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. దీనిని సమీపంలోని ఏ గ్యాస్ ఏజెన్సీ దగ్గరకు వెళ్లి అయినా అప్పటికప్పుడు తీసుకునే అవకాశాలను కల్పిస్తున్నట్లు గ్యాస్ కంపెనీలు వెల్లడించాయి. పెట్రోల్ బంకులు, విక్రయ కేంద్రాలు, కిరాణా దుకాణాల్లో కూడా దీనిని తీసుకోవచ్చు. మరోవైపు ఎల్పీజీ గ్యాస్ బుకింగ్ పై ప్రజలకు గ్యాస్ కంపెనీలు కీలక సూచనలు చేశాయి. బుకింగ్ ల కోసం ఆందోళన చెందొద్దని, పానిక్ బుకింగ్ లు చేసుకోవద్దని కోరాయి.

Read Also: హిమంత బిశ్వ శర్మ దేశంలో భారీ అవినీతిపరుడు: రాహుల్ గాంధీ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>