కలం, జనగామ : జనగామ (Jangaon) లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు(BJP State Chief) రామచంద్ర రావు (Ramchander Rao) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఆదివారం జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో హామీలను సరిగా అమలు చేయకుండానే ఇతర రాష్ట్రాలకు వెళ్లి అమలు చేశామని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. పొరుగు రాష్ట్రాల ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను (Six Guarantees) పూర్తి స్థాయిలో అమలు చేయకుండా, బయట గొప్పలు చెప్పుకోవడం సరికాదని ఆయన (Ramchander Rao) మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా పారదర్శకంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా పాలన అందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు తమకు రావాల్సిన లబ్ధి కోసం ఎదురు చూస్తున్నారని, హామీలు నెరవేర్చకపోతే ప్రజలే తగిన సమాధానం ఇస్తారని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Also: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. మార్కెట్ లోకి 5 కిలోల సిలిండర్లు
Follow Us On: Instagram

