మోదీ నాయకత్వంలో ప్రపంచానికి భారత్ సత్తా చాటాం: పీవీఎన్‌ మాధవ్‌

కలం, వెబ్ డెస్క్: ఏపీలో భారతీయ జనతా పార్టీ (BJP) 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలోని రాష్ట్ర కార్యాలయం వద్ద బీజేపీ పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ (PVN Madhav) హాజరై పార్టీ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. జనసంఘ్ ఏర్పాటై 75 వసంతాలు, బీజేపీ ఏర్పాటై 47 ఏళ్ల అయిందని అన్నారు. ఈ ప్రస్థానంలో దేశం మొదట అనే నినాదంతో వైషమ్యాలు లేని శక్తివంతమైన నవ భారత నిర్మాణమే లక్ష్యంగా పనిచేశామని చెప్పారు. ప్రధాని మోదీ (Modi) నాయకత్వంలో ఆర్టికల్ 370 రద్దు, భవ్య రామ మందిర నిర్మాణం, ఉగ్రవాదంపై ఉక్కుపాదం, అంతర్జాతీయ దౌత్య విజయాలతో ప్రపంచానికి భారత్ సత్తా చాటామని స్పష్టం చేశారు.

2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ప్రతి పౌరుడూ భాగస్వామి కావాలని పిలుపునిస్తూ, సబ్ కా సాథ్ – సబ్ కా వికాస్ స్ఫూర్తితో ముందుకెళ్తున్నామని వివరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో మన బాధ్యతను మరింత పెంచుకుంటూ వెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. మన ఊరు – మన జెండా కార్యక్రమంతో మోదీ అభివృద్ధిని ప్రతి గడపకూ తీసుకెళ్దామని మాధవ్ (PVN Madhav) పిలుపునిచ్చారు.

Read Also: ప్రేమ వివాహాలపై కీలక నిర్ణయం.. గుజరాత్‌లో కఠినం, కర్ణాటకలో స్వేచ్ఛ!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>