కలం, వెబ్ డెస్క్: రీల్స్ పిచ్చి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ విషాద ఘటన హర్యానాలోని (Haryana) కర్నాల్‌లో జరిగింది. సోషల్ మీడియా లైక్స్ కోసం రాజేంద్ర అనే పాములు ఆడించే వ్యక్తి ప్రమాదకరంగా నాగుపాము తలను నోట్లో పెట్టుకున్నాడు. దాంతో రీల్స్ (Reels) చేసేందుకు ప్రయత్నించాడు. మరొకరు ఈ దృశ్యాన్ని వీడియో తీస్తుండగా, అజాగ్రత్త కారణంగా ఆ పాము ఒక్కసారిగా రాజేంద్ర నాలుకపై కాటు వేసింది. దీంతో ఆరోగ్యం క్షీణించగా, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది. కొద్దిసేపటికే ఆయన ప్రాణాలు విడిచారు. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ప్రాణాలతో చెలగాటం ఆడుతూ, ఇలాంటి ప్రాణాంతక సాహసాలకు పాల్పడవద్దని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.
Read Also: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. వచ్చే నెలలో లిక్కర్ రేట్ల పెంపు?
Follow Us On : WhatsApp

