కలం, వెబ్ డెస్క్: డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అంటే.. ఠక్కున గుర్తొచ్చేది పూరి జగన్నాథ్. ఆయన ఈమధ్య కాలంలో కెరీర్‌లో బాగా వెనకబడ్డాడు. లైగర్, డబుల్ ఇస్మార్ట్.. సినిమాలతో వరుసగా ప్లాపులు ఇవ్వడంతో… హీరోలు పూరితో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. తెలుగులో ఏ హీరోతో ప్రాజెక్ట్ సెట్ కాకపోవడంతో.. ఆఖరికి తమిళ్‌లో విజయ్ సేతుపతితో (Vijay Sethupathi) భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా కోసం విజయ్‌ని పూర్తిగా మార్చేసారని కోలీవుడ్, టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. పూరి ఏం చేశారు..? ఈ సినిమా వచ్చేది ఎప్పుడు..?
పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్టుగా.. హీరోలందూ పూరి హీరోలు వేరు. అప్పటి వరకు ఆ హీరోలకు ఉన్న ఇమేజ్‌ను పూర్తిగా మార్చేస్తారు పూరి జగన్నాథ్. ఇప్పుడు చేస్తున్న మూవీలో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) లుక్‌ను కూడా పూర్తిగా మార్చేసారు. విజయ్ సేతుపతి తమిళ్‌లో బిగ్‌బాస్‌షోకు హోస్ట్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ షోలో విజయ్ సేతుపతి కొత్త లుక్‌లో కనిపించేసరికి జనాలు షాక్ అయ్యారు. సోషల్ మీడియాలో అయితే.. విజయ్ సేతుపతి న్యూలుక్ వైరల్ అయ్యింది. ఇది పూరితో చేస్తున్న మూవీ లుక్ అంటూ వార్తలు వస్తున్నాయి.
ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్‌లుక్‌ను ఆమధ్య రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. ఊహించని విధంగా పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. కొత్త సంవత్సరంలో ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారు. విజయ్ సేతుపతి.. కథలో కొత్తదనం లేకపోతే సినిమా చేయరు. ఆయన ఈ మూవీ చేసారంటే.. కథలో కొత్తనం ఉన్నట్టే అని.. పక్కా హిట్ అని.. పూరి ఫామ్ లోకి రావడం ఖాయమని టాక్ వినిపిస్తోంది. మరి.. ప్రచారంలో ఉన్నట్టుగా ఈ మూవీలో పూరి ఫామ్ లోకి వస్తారేమో చూడాలి.
Read Also: ఢిల్లీ హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ థాంక్స్..
Follow Us On: Instagram


