కలం వెబ్ డెస్క్ : తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల్లో, పట్టణాల్లో వీధి కుక్కల(Stray dogs) దాడులు తీవ్రంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా చిన్నారులపై జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. స్థానికంగా ప్రజలు ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఈ సమస్యను అసెంబ్లీలో (Assembly) ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రస్తావించారు. డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రునాయక్ (Ramachandru Naik) కుక్కల బెడదపై మాట్లాడారు. పురపాలికల్లో కుక్కలు బాగా పెరిగిపోయాయని, రాత్రుళ్లు గుంపులుగా ఏర్పడి వచ్చేపోయే వారిపై దాడులు చేస్తున్నాయని పేర్కొన్నారు. వాటిని అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని సభలో కోరారు.
కుక్కల బెడద గురించి అసెంబ్లీలో (Assembly) ఎమ్మెల్యే మాట్లాడిన రోజే రంగారెడ్డి(Rangareddy) జిల్లాలో మరో ఘటన జరిగింది. రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్ వాసుదేవరెడ్డి కాలనీలో మూడేళ్ల చిన్నారి నిత్యశ్రీపై వీధి కుక్క దాడి చేసింది. దీంతో చిన్నారి తీవ్రంగా గాయపడింది. చిన్నారి ముఖంపైనే ఏకంగా 18 కుట్లు వేయాల్సి వచ్చింది. అనంతరం కుక్కను పట్టుకున్నారు. కాలనీలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.
Read Also: మాక్కూడా పీపీటీకి ఛాన్స్ ఇవ్వండి.. స్పీకర్‌కు బీఆర్ఎస్ఎల్పీ వినతి
Follow Us On: X(Twitter)


