కలం, వెబ్ డెస్క్ : జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టుకు(Delhi High Court) ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. డిసెంబర్ 8న జూనియర్ ఎన్టీఆర్ (JR NTR) ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. తన పర్మిషన్ లేకుండా తన ఫొటోలు, వీడియోలు, వాయిస్ ను సోషల్ మీడియాలో వాడుతున్నారని.. ఏఐ టెక్నాలజీతో అసభ్యకరంగా క్రియేట్ చేస్తున్నారని.. వాటిపై చర్యలు తీసుకోవాలంటూ కోరారు. తన పర్మిషన్ లేకుండా ఎలాంటి ఫొటోలు, వీడియోలు వాడకుండా ఆదేశాలు ఇవ్వాలని జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్ లో విన్నవించారు.
ఈ కేసును మొన్న డిసెంబర్ 22న విచారించిన కోర్టు.. జూనియర్ ఎన్టీఆర్ కు అనుకూలంగా ఆదేశాలు ఇచ్చింది. ఆయన పర్మిషన్ లేకుండా ఎలాంటి ఫొటోలు, వీడియోలు వాడొద్దంటూ తెలిపింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు తాజాగా రిలీజ్ కావడంతో దీనిపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ‘నా వ్యక్తిత్వ హక్కులను కాపాడే విధంగా ఉత్తర్వులు మంజూరు చేసినందుకు ఢిల్లీ హైకోర్టుకు కృతజ్ఞతలు. సుప్రీంకోర్టు లాయర్లు డాక్టర్ బాలజానకి శ్రీనివాసన్, డాక్టర్ అల్కా డాకర్, రాజేందర్, రైట్స్ అండ్ మార్క్స్ టీమ్ కు స్పెషత్ థాంక్స్’ అంటూ రాసుకొచ్చాడు జూనియర్ ఎన్టీఆర్ (JR NTR).
Read Also: సందీప్ న్యూ ఇయర్ బ్లాస్ట్.. ‘స్పిరిట్’ నుంచి ప్రభాస్ ఫ్యాన్స్‌కు గ్రాండ్ సర్‌ప్రైజ్!
Follow Us On: Youtube


