కలం వెబ్ డెస్క్ : నేడు ఉదయం తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. జీరో అవర్, దివంగత మాజీ ఎమ్మెల్యేల సంతాప తీర్మానం అనంతరం సభ ప్రారంభమైంది. కొందరు ఎమ్మెల్యేలు మాట్లాడిన తర్వాత ఇరు సభలను జనవరి 2కు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అయితే ఈ సమావేశాల్లో కృష్ణా జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో నీటి వాటా తగ్గింపును, కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలను సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్(PPT) ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటన్నింటికి గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వమే కారణమని గత పాలకుల్ని ఇబ్బందుల్లో పెట్టేందుకు స్కెచ్ వేసింది.
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) సైతం ఈ అంశాలపై బహిరంగ చర్చకు రావాలని కేటీఆర్(KTR)కు సవాల్ విసిరారు. కేటీఆర్, రేవంత్ మధ్య దీనిపై మాటల యుద్ధం నడిచింది. ప్రభుత్వం పీపీటీ ఇస్తుందన్న సమాచారంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారు. నదీ జలాలపై, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు తమకూ అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి తదితరులు స్పీకర్‌కు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినప్పుడు బీఆర్ఎస్‌కు (BRS) కూడా ఛాన్స్ ఇస్తే చర్చకు న్యాయం జరుగుతుందని కోరారు. ప్రజలకు వీటిపై నిజాలు తెలియాలంటే డాక్యుమెంట్లు, వీడియోల రూపంలో లోతుగా వివరించాలని సూచించారు. పీపీటీ విషయంలో ప్రభుత్వానికి ఇస్తున్న అనుమతులన్నీ ప్రతిపక్షానికి కూడా ఇవ్వాలన్నారు.
Read Also: కేటీఆర్‌కు తండ్రి మీదున్న గౌరవం ఇదేనా?: కాంగ్రెస్ విమర్శలు
Follow Us On: Youtube


