కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగితే.. పంజాబ్ కింగ్స్ (Punjab Kings) జట్టు అంతకు మించి బదులిస్తూ సన్‌రైజర్స్‌కు చుక్కలు చూపించింది. అభిషేక్ శర్మ (74) ధాటికి హైదరాబాద్ 219 పరుగుల భారీ స్కోరు సాధించినా, పంజాబ్ వీరుల ముందు ఆ లక్ష్యం చిన్నబోయింది. ప్రియాన్ష్ ఆర్య (57), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (51) మెరుపు ఆరంభం ఇవ్వగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (69*) అజేయ ఇన్నింగ్స్‌తో మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే పంజాబ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్‌లో అభిషేక్ శర్మ (Abhishek Sharma) కేవలం 28 బంతుల్లోనే 8 సిక్సర్లతో విరుచుకుపడి పంజాబ్ బౌలర్లను వణికించాడు. హెడ్ (38), క్లాసెన్ (39) కూడా రాణించడంతో హైదరాబాద్ భారీ స్కోరు సాధించింది. అయితే, పంజాబ్ బౌలింగ్‌లో శశాంక్ సింగ్ కేవలం 20 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు తీసి రన్ రేట్‌ను కాస్త ఆపగలిగాడు. భారీ ఛేదనలో పంజాబ్ ఏమాత్రం తడబడలేదు. శివాంగ్ కుమార్ తన బౌలింగ్‌తో హైదరాబాద్‌ను కట్టడి చేసే ప్రయత్నం చేసినా, శ్రేయస్ అయ్యర్ సిక్సర్ల సునామీ ముందు ఎవరూ నిలవలేకపోయారు.
చివరికి 18.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసిన పంజాబ్, ఈ సీజన్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఛేజింగ్‌ను నమోదు చేసింది. హైదరాబాద్ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో పంజాబ్ విజయం సులువైంది. మొత్తానికి బ్యాటర్ల పండుగగా సాగిన ఈ పోరులో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) ‘రాజసం’ ఉట్టిపడింది.
Read Also: మామిడిపండ్లలో ఖరీదైన వెరైటీ తెలుసా? కిలో ధర ఎంతో వింటే షాక్ అవ్వాల్సిందే !
Follow Us On : WhatsApp

