కలం, వెబ్ డెస్క్ : విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika) జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న క్రేజీ మూవీ ‘రణబాలి’ (Ranabaali). ఈ సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ‘రణబాలి’ సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్‌కు రాబోతోంది. ఇటీవలే విజయ్, రష్మిక వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా ఈ కొత్త జంట రణబలి సెట్ లోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా విజయ్, రష్మికకు చిత్ర యూనిట్ వెల్‌కమ్ చెబుతూ సెలబ్రేట్ చేశారు. కేక్ కట్ చేయించి, హ్యూపీ మ్యారీడ్ లైఫ్ మిస్టర్ అండ్ మిసెస్ రణబాలి అంటూ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సినిమా (Ranabaali)లో రణబాలి అనే యోధుడి పాత్రలో విజయ్ దేవరకొండ, జయమ్మగా రశ్మిక మందన్న ప్రేక్షకుల్ని ఆకట్టుకోనున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రణబలి సినిమా రూపొందుతోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నతో పాటు ఆర్నాల్డ్ వోస్లూ తదితరులు ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు.
Read Also: మామిడిపండ్లలో ఖరీదైన వెరైటీ తెలుసా? కిలో ధర ఎంతో వింటే షాక్ అవ్వాల్సిందే !
Follow Us On: Facebook

